బీసీ సబ్‌ప్లాన్‌కు శ్రీకారం: బిసిమంత్రి రవీంద్ర
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ సంక్షేమానికి పెద్దపీట వేశారని, అందుకోసం రూ. 6440 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌కు శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం విజయవాడలో మంత్రి మాట్లాడుతూ 21 ప్రభుత్వ విభాగాలకు బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్‌కు దేశంలో మొదటిసారిగా 20 శాతం నిధులు కేటాయించారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుందని, ఇక్కడ ఆదా చేసే నీటిని రాయలసీమకు తరలించడం ద్వారా ఆ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుందన్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి జూన్ చివరి వరకు సమయముందని, ఇప్పటికే 3 బృందాలు తమిళనాడులో పాలసీని పరిశీలించి వచ్చాయని మంత్రి అన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో మరో టీం తమిళనాడు వెళ్తుందని, అవసరమైతే తాను కూడా వెళ్లి వస్తానన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








